Header Banner

కేటీఆర్‌కు స్వల్ప గాయాలు..! పవన్ కళ్యాణ్‌, లోకేష్‌, జగన్ ట్వీట్లు వైరల్!

  Tue Apr 29, 2025 17:04        Politics

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. ఈరోజు ఆయన హైదరాబాద్లోని ఒక జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గాయపడినట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయాన్ని కేటీఆర్ స్వయంగా తన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలియజేశారు. కేటీఆర్ కు గాయాలు... స్వయంగా తెలిపిన కేటీఆర్ జిమ్ లో వర్కౌట్ చేస్తూ పడడంతో తనకు గాయాలయ్యాయని, వైద్యులు కొద్దిరోజుల పాటు తనను విశ్రాంతి తీసుకోవాలని సూచించారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నానని కేటీఆర్ తన పోస్టులో వివరించారు. ఈ గాయం నుంచి కోలుకొని వీలైనంత త్వరగా రోజువారీ కార్యక్రమాలలో పాల్గొంటానని ఆయన తన పోస్టు ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు.
కేటీఆర్ కు గాయాలు.. పవన్ కళ్యాణ్ ట్వీట్
ఇక కేటీఆర్ గాయపడిన విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు, అభిమానులు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. ఇక కేటీఆర్ జిమ్ లో వర్కౌట్ చేస్తూ గాయపడిన క్రమంలో కేటీఆర్ చేసిన ట్వీట్ కు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


ఇది కూడా చదవండి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజయవాడ పర్యటన! కారణం ఇదే..!


త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
సోదరుడు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిమ్ లో వ్యాయామం చేస్తూ గాయపడ్డారని తెలిసిందని, వైద్యుల సూచనలకు అనుగుణంగా తగిన విశ్రాంతి తీసుకోవాలని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. ఇక మరోవైపు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ కు గాయం కావడం పైన స్పందించారు.
జగన్, లోకేష్ ట్వీట్స్
ట్విట్టర్ వేదికగా బ్రదర్ కేటీఆర్ అంటూ పోస్ట్ చేసిన వైయస్ జగన్ మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ జగన్ పేర్కొన్నారు. ఇక మరోవైపు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని నారా లోకేష్ సైతం ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆత్మీయులు కేటీఆర్ జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తుండగా గాయమైంది అని తెలిసి బాధపడ్డాను అని పేర్కొన్న నారా లోకేష్ వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

ఇది కూడా చదవండిమరో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #KTRInjury #PawanKalyan #JaganMohanReddy #NaraLokesh #GetWellSoonKTR #TelanganaPolitics